News March 16, 2025
ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్డేట్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Similar News
News March 16, 2025
సునీతా విలియమ్స్ జీతం ఎంతంటే?

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ కొద్ది రోజుల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఆమె జీతం గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె జీతం, ఆహారం, బస ఖర్చులను నాసానే భరిస్తుంది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే స్పేస్లో అదనంగా ఉంటే రోజుకు రూ.347 (4 డాలర్లు) మాత్రమే ఇస్తుందని సమాచారం.
News March 16, 2025
భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి: డీకే అరుణ

TG: తన ఇంట్లోకి <<15780375>>ఆగంతకుడు<<>> ఎందుకు ప్రవేశించాడో తెలియలేదని ఎంపీ డీకే అరుణ చెప్పారు. హాల్, కిచెన్, బెడ్ రూమ్లో సెర్చ్ చేశాడని, ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. తన భర్తకు ఇప్పటివరకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. గతంలో తన నాన్నపై దాడి జరిగిందని, భద్రత పెంపుపై సీఎం రేవంత్ ఆలోచించాలని కోరారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
News March 16, 2025
బంగారం ధర తగ్గే అవకాశం ఉందా?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు తగ్గుతాయనే విషయమై నిపుణులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ అనూహ్య నిర్ణయాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే తగ్గకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 3వేల డాలర్లు ఉన్న ఔన్సు ధర 3,040 డాలర్లకు చేరాక అక్కడి నుంచి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై 1-2 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.