News October 12, 2024
కమలా హారిస్‌కు ఏఆర్ రెహమాన్ మద్దతు

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె కోసం 30 నిమిషాల సంగీత ప్రదర్శన వీడియోను రేపు విడుదల చేయనున్నారు. దక్షిణాసియా నుంచి హారిస్‌కు మద్దతునిచ్చిన తొలి కళాకారుడు ఆయనే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరఫున హారిస్ పోటీ పడుతున్నారు.
Similar News
News November 24, 2025
జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది: చైనా

తైవాన్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక జోక్యానికి జపాన్ వెనుకాడబోదని ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ కామెంట్లతో జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసిందని చైనా మినిస్టర్ వాంగ్ యీ అన్నారు. జపాన్ సైనికవాదం పెరగకుండా నిరోధించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా తకాయిచి కామెంట్లు ఉన్నాయంటూ UNకు రాసిన లెటర్లో చైనా పేర్కొంది.
News November 24, 2025
మృణాల్తో ధనుష్ డేటింగ్?.. పోస్టులు వైరల్

ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. మృణాల్ నటించిన ‘దో దీవానే షెహర్ మే’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. దీనిపై ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా ‘చాలా బాగుంది’ అనే అర్థంలో ధనుష్ కామెంట్ చేశారు. దీనికి హీరోయిన్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్లను అభిమానులు వైరల్ చేస్తున్నారు. వారిమధ్య బంధం నిజమేనంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరగగా మృణాల్ ఖండించారు.
News November 24, 2025
డిటెన్షన్ సెంటర్లకు అక్రమ వలసదారులు: యూపీ సీఎం

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను యూపీ CM యోగి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వలసదారుల వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచాలని సూచించారు. వారు స్థిరపడిన విధానాన్ని బట్టి స్వదేశాలకు పంపించాలన్నారు. మరోవైపు 8ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పుడు కావాలనే హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.


