News October 12, 2024

కమలా హారిస్‌కు ఏఆర్ రెహమాన్ మద్దతు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె కోసం 30 నిమిషాల సంగీత ప్రదర్శన వీడియోను రేపు విడుదల చేయనున్నారు. దక్షిణాసియా నుంచి హారిస్‌కు మద్దతునిచ్చిన తొలి కళాకారుడు ఆయనే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరఫున హారిస్ పోటీ పడుతున్నారు.

Similar News

News November 9, 2024

రాహుల్ దిశానిర్దేశంలేని క్షిపణి: అస్సాం సీఎం

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నియంత్రణ లేదంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు మండిపడ్డారు. ‘రాహుల్ ప్రస్తుతం నియంత్రణ లేని క్షిపణిలా ఉన్నారు. సోనియా శిక్షణనివ్వకపోతే మున్ముందు దారీతెన్నూ లేని క్షిపణిగా మారతారు. ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఝార్ఖండ్‌కు వచ్చిన రాహుల్ తీవ్రవాదుల గురించి ఒక్క ముక్కా మాట్లాడలేదు. ఆయన గిరిజనులకు, వెనుకబాటు వర్గాలకు వ్యతిరేకి’ అని విమర్శించారు.

News November 9, 2024

ప్రియాంకా చోప్రా నాకు రోల్ మోడల్: సమంత

image

ప్రియాంకా చోప్రా తనకు రోల్ మోడల్ అని నటి సమంత వెల్లడించారు. బిజినెస్ టుడే నిర్వహించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘సిటాడెల్ తొలి సీజన్ అమెరికాలో, రెండోది ఇటలీ, మూడోది భారత్, తర్వాత మెక్సికోలో జరుగుతుంటుంది. అమెరికా వెర్షన్‌లో ప్రియాంక నటించగా ఇండియా వెర్షన్‌లో నాకు అవకాశం దక్కింది. ప్రియాంక ఓ రోల్ మోడల్. గొప్పగా ఆలోచించడమనేది ఆమెనుంచే నేర్చుకుంటున్నా’ అని కొనియాడారు.

News November 9, 2024

అవును.. కెనడాలో ఖలిస్థానీలున్నారు: ట్రూడో

image

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులున్నట్లు ఆ దేశ PM జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే తమ దేశంలోని సిక్కులందరికీ వారు ప్రతినిధులు కారని స్పష్టం చేశారు. మోదీని అభిమానించే హిందువులూ తమ దేశంలో ఉన్నారని, వారు కూడా మొత్తం హిందువులకు ప్రతినిధులు కాదని అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీలకు కెనడా స్వర్గధామంగా మారిందన్న భారత్ ఆరోపణలకి ట్రూడో వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.