News June 14, 2024

ఏలియన్స్ మన మధ్యే ఉన్నాయేమో: హార్వర్డ్

image

ఏలియన్స్ మనుషుల రూపంలో మన మధ్యే తిరుగుతూ ఉండొచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. భూగర్భంలోనూ ఇవి ఉండొచ్చని, ఇక్కడి ఫ్రెండ్స్‌ కోసం అంతరిక్షం నుంచి ఏలియన్స్ వచ్చివెళ్లే అవకాశాలు ఉన్నాయట. ‘క్రిప్టోటెరస్ట్రియల్స్’ థియరీ ఆధారంగా ఈ రీసెర్చ్ చేసినట్లు తెలిపారు. కాగా ఏలియన్స్ భూమికి <<12456903>>రావడం<<>> అసాధ్యమని JANలో ఇదే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పడం గమనార్హం.

Similar News

News September 12, 2024

మంగళగిరి నివాసమే క్యాంపు ఆఫీస్.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

image

AP: విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంగళగిరిలోని తన నివాసాన్నే క్యాంపు ఆఫీసుగా వాడుకోనున్నారు. పాత ఆఫీసును, అందులోని ఫర్నిచర్‌ను వెనక్కు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

News September 12, 2024

మీ ఇంటి వద్ద జరిగినదానికి సారీ మాల్వీ: రాజ్ తరుణ్

image

ముంబైలో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా నివాసం వద్ద నటుడు రాజ్ తరుణ్ ఉన్న సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి ఆయన్ను అప్పగించాలంటూ హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్వీకి రాజ్‌తరుణ్ ట్విటర్‌లో సారీ చెప్పారు. ‘ముంబైలో మీ ఇంటివద్ద జరిగినదానికి చాలా సిగ్గుపడుతున్నాను మాల్వీ. సారీ. కానీ మీ ఫ్రెండ్స్‌తో కలిసి వినాయక చవితిని బాగా జరుపుకొన్నాం. గణేశుడి దీవెనలు మీకు ఉండాలి’ అని ట్వీట్ చేశారు.

News September 12, 2024

రేపు పిఠాపురంలో YS జగన్ పర్యటన

image

AP: మాజీ సీఎం YS జగన్ రేపు కాకినాడ జిల్లా పిఠాపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్కపేటలోని వరద బాధితులను పరామర్శిస్తారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.