News October 2, 2024
సనాతన ధర్మం అంటూనే అన్ని వైన్ షాపులా?: MP గురుమూర్తి
APలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాకు 227 వైన్ షాపులు కేటాయించడంపై స్థానిక YCP MP గురుమూర్తి మండిపడ్డారు. ‘గౌరవనీయులైన సీఎం, డిప్యూటీ సీఎం గారు.. సనాతన ధర్మ పరిరక్షకులమని చెప్పుకుంటూ తిరుపతి జిల్లాకు ఇన్ని షాపులు కేటాయించడం బాధాకరం. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు సనాతన ధర్మరక్షణలో ఎట్టి పరిస్థితుల్లో భాగం కాజాలవు. తిరుపతి ప్రజలు ప్రతీ విషయం గమనిస్తున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News October 5, 2024
రూ.150 కోసం ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి
AP: కృష్ణా(D) కంకిపాడు(M) ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రూ.150 నగదు విషయంలో స్నేహితులు భుజంగరావు, వెంకటస్వామి మధ్య గొడవ ఏర్పడింది. వెంకటస్వామి ఆగ్రహంతో భుజంగరావు గుండెపై గట్టిగా కొట్టారు. అతను గతేడాదే హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ NZB, SRCL, SDPT, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, VKB, SRD, MDK, NRPT, కామారెడ్డి, MBNR, NGKL, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది.
News October 5, 2024
పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు!
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుబట్టారని తెలిపింది.