News June 14, 2024
ఇకపై కార్లు మరింత కాస్ట్లీ?

వాహనాల కర్బన ఉద్గారాలపై కేంద్రం తెచ్చిన CAFE-3, CAFE-4 మార్గదర్శకాలు కార్ల ధరలపై ప్రభావం చూపొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 APRలో BS-6 నార్మ్స్ అమలులోకి వచ్చాక ధరలు 30% పెరిగాయని, ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నాయి. ఐదేళ్లలో తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే బడ్జెట్ కార్లను రూపొందించడం సవాల్‌తో కూడుకుందని తెలిపాయి. కర్బన ఉద్గారాల ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించాలని కేంద్రం ఆదేశించింది.
Similar News
News October 31, 2025
షెఫర్డ్ హ్యాట్రిక్.. బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
News October 31, 2025
ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డేనా..!

TG: సుదీర్ఘ కాలానికి CONG అధికారంలోకి రావటంతో పదవులు ఆశిస్తున్న వారు అధికంగానే ఉన్నారు. హైకమాండ్, CM రేవంత్ ఏదో రకంగా వారికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోస్టుల భర్తీ చేపట్టారు. అజహరుద్దీన్‌ను మంత్రిగా, మంత్రి పదవులు కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులను అడ్వైజర్, ఛైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. ఆయనను ఎలా సంతృప్తిపరుస్తారనేది ఆసక్తికరం.
News October 31, 2025
ఈ పెయింటింగ్ ఖరీదు.. రూ.120 కోట్లు

మొఘల్(16వ శతాబ్దం) కాలంలో బస్వాన్ అనే చిత్రకారుడు వేసిన ఓ పెయింటింగ్ రూ.120 కోట్లకు(13.6 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయింది. కొండలు, పచ్చిక బయళ్ల మధ్య చీతా ఫ్యామిలీ సేద తీరుతున్నట్లుగా ఉండే ఈ చిత్రాన్ని 29.8CM ఎత్తు, 18.6CM వెడల్పు ఫ్రేమ్‌పై గీశారు. తాజాగా ఆ పెయింటింగ్ లండన్‌లో జరిగిన క్రిస్టీ వేలంలోకి వచ్చింది. అంచనాకు మించి సుమారు 14 రెట్ల అధిక ధర పలికింది.


