News June 14, 2024

ఇకపై కార్లు మరింత కాస్ట్లీ?

image

వాహనాల కర్బన ఉద్గారాల‌పై కేంద్రం తెచ్చిన CAFE-3, CAFE-4 మార్గదర్శకాలు కార్ల ధరలపై ప్రభావం చూపొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 APRలో BS-6 నార్మ్స్ అమలులోకి వచ్చాక ధరలు 30% పెరిగాయని, ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నాయి. ఐదేళ్లలో తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే బడ్జెట్ కార్లను రూపొందించడం సవాల్‌తో కూడుకుందని తెలిపాయి. కర్బన ఉద్గారాల ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించాలని కేంద్రం ఆదేశించింది.

Similar News

News September 20, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 20, 2024

రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం

image

AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేపు ఆగమ, వైదిక పరిషత్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

News September 20, 2024

పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం

image

AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.