News April 11, 2025
అసలేంటీ కోనోకార్పస్ చెట్లు? ఎందుకింత చర్చ?

కోనోకార్పస్.. అమెరికా ఖండాల్లోని తీరప్రాంతానికి చెందిన మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈ మొక్కను ప్లాంటేషన్ నిపుణులు INDకు తెచ్చారు. చూడటానికి గుబురుగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఈ చెట్లు <<16065381>>పర్యావరణ<<>>, ఆరోగ్య సమస్యలకు కారకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వేర్లు లోతుగా వెళ్లి తాగునీరు వ్యవస్థలు, భవనాలను సైతం దెబ్బతీస్తాయంటున్నారు. ఈ చెట్లు అందం కోసం తప్పితే మరెందుకూ పనికిరావనేది వారి వాదన.
Similar News
News April 18, 2025
రేపు జాగ్రత్త: ఎండలు, పిడుగులతో వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు విభిన్న వాతావరణం ఉంటుందని APSDMA వెల్లడించింది. పలు జిల్లాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, <
News April 18, 2025
‘ప్యారడైజ్’ తర్వాత సుజీత్‌తో సినిమా: నాని

డైరెక్టర్ సుజీత్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని, ఇప్పటికే కథ ఓకే అయ్యిందని హీరో నాని వెల్లడించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పూర్తయ్యాక వచ్చే ఏడాది సుజీత్‌తో మూవీ ఉంటుందన్నారు. అది భారీ బడ్జెట్ ప్రాజెక్టు అని, వేరే లెవెల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
News April 18, 2025
4 రోజుల వేట.. 800 CCTVల స్కాన్.. నిందితుడి అరెస్ట్

ఢిల్లీలోని ఆస్పత్రిలో ICUలో చికిత్స పొందుతున్న <<16113128>>ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి<<>> పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 బృందాలు 4 రోజులపాటు వేట సాగించి, 800 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి అతడిని పట్టుకున్నారు. నిందితుడి పేరు దీపక్ అని, బిహార్ ముజఫర్‌నగర్ వాసి అని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో 5 నెలలుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు.