News September 26, 2024

ప్రజలు ఎగిరితంతారని భయపడుతున్నారా?: BJP

image

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజలతో మంత్రుల ముఖాముఖి’ నిర్వహణ తీరును తెలంగాణ BJP విమర్శించింది. ‘కంచెలు లేని మంచి పాలన తెస్తామని గొంతు చించుకుని అరిచినోళ్లు ఈరోజు ఎవరినీ చెంతకు రానివ్వకుండా కంచెల చాటున దాక్కుని మాట్లాడుతున్నారెందుకో? మీ మోసాన్ని, మీరు పెడుతున్న గోసల్ని చూసి ఎవరు ఎక్కడినుంచి వచ్చి ఎగిరితంతారోనని భయపడుతున్నారా?’ అని ట్వీట్ చేసింది. నేటి ముఖాముఖిలో మంత్రి దామోదర పాల్గొన్నారు.

Similar News

News January 31, 2026

నేడే పింఛన్ల పంపిణీ

image

AP: రాష్ట్రంలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈరోజే నగదు అందజేయనున్నారు. కుప్పంలో గుడుపల్లె(M) బెగ్గిలిపల్లెలో CM చంద్రబాబు నగదు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు. ఇవాళ నగదు అందుకోలేకపోతే FEB 2న తీసుకోవచ్చని తెలిపింది.

News January 31, 2026

స్కూళ్లలో ‘ఆధార్’ క్యాంపులు

image

TG: విద్యార్థుల ఆధార్ రిజిస్ట్రేషన్, అప్‌డేట్ కోసం స్కూళ్లలో స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ సెంటర్లు ఎప్పుడు, ఏ స్కూలులో ఉంటాయో తెలుసుకునేందుకు డీఈవో, ఎంఈవోలను సంప్రదించాలని సూచించింది. 5-15, 15-17 ఏళ్ల వయసున్న అన్ని స్కూళ్ల విద్యార్థుల ఫస్ట్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితమని, రెండోసారి అయితే ₹125, వివరాల మార్పునకు ₹75 చెల్లించాలని అధికారులు తెలిపారు.

News January 31, 2026

శని త్రయోదశి నాడు పఠించాల్సిన శ్లోకం

image

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్|
ఛాయా మార్తాండ సంభూతుడు తం నమామి శనైశ్చరమ్||
నేడు ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు పఠించడం వల్ల శని గ్రహ పీడలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ‘‘ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలంటున్నారు. ‘‘ఓం నమః శివాయ’’ పంచాక్షరీ మంత్రాన్ని జపించినా విశేష ఫలితాలుంటాయని, వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని సూచిస్తున్నారు.