News September 26, 2024
ప్రజలు ఎగిరితంతారని భయపడుతున్నారా?: BJP
TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజలతో మంత్రుల ముఖాముఖి’ నిర్వహణ తీరును తెలంగాణ BJP విమర్శించింది. ‘కంచెలు లేని మంచి పాలన తెస్తామని గొంతు చించుకుని అరిచినోళ్లు ఈరోజు ఎవరినీ చెంతకు రానివ్వకుండా కంచెల చాటున దాక్కుని మాట్లాడుతున్నారెందుకో? మీ మోసాన్ని, మీరు పెడుతున్న గోసల్ని చూసి ఎవరు ఎక్కడినుంచి వచ్చి ఎగిరితంతారోనని భయపడుతున్నారా?’ అని ట్వీట్ చేసింది. నేటి ముఖాముఖిలో మంత్రి దామోదర పాల్గొన్నారు.
Similar News
News October 7, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 7, 2024
ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే: ఒవైసీ
TG: హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బాపూఘాట్‌తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
News October 7, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 7, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:21 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:00 గంటలకు
ఇష: రాత్రి 7.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.