News August 22, 2025
ఇవాళ స్కూళ్లు, కాలేజీలూ బందేనా?

మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ <<17479279>>బంద్‌కు<<>> ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో పలు ప్రాంతాల్లో షాపులు మూతబడనున్నాయి. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారు. వాణిజ్యానికి సంబంధించిన అంశం కాబట్టి స్కూళ్లు, కాలేజీలపై ప్రభావం చూపే అవకాశం లేదు. నేడు స్కూళ్లకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు రాలేదని తెలుస్తోంది. మరి మీకేమైనా హాలిడే అని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
Similar News
News August 22, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220 తగ్గి రూ.1,00,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 పతనమై రూ.92,150 పలుకుతోంది. అటు KG వెండి ధరపై రూ.2,000 పెరిగి రూ.1,28,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 22, 2025
చిరిగిన చొక్కాతోనే తాళికట్టిన చిరు!

చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన మరోసారి వైరలవుతోంది. చిరు పెళ్లిరోజు MSరెడ్డి నిర్మించిన ‘తాతయ్య ప్రేమలీలలు’ చిత్రంలో ఓ పాట షూట్ చేస్తున్నారు. డ్రెస్ మార్చుకునే టైంలేక చిరిగిన చొక్కాతోనే పెళ్లిపీటలపై కూర్చున్నారు. ఎవరో చొక్కా చిరిగింది అనగానే.. ‘షర్ట్ చిరిగితే తాళి కట్టనివ్వరా?’ అని కొంటెగా బదులిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News August 22, 2025
వరంగల్ ఎయిర్‌పోర్ట్.. ఎకరానికి రూ.1.20 కోట్లు జమ

TG: వరంగల్ మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు జమ చేశారు. మొత్తం 253 ఎకరాలను సేకరించనుండగా ఇందుకోసం రూ.205 కోట్లు కేటాయించింది. అటు వ్యవసాయేతర భూమి(ఓపెన్ ప్లాట్లు)కి గజానికి రూ.4వేల వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్పగా స్థానికులు ఒప్పుకోవట్లేదు. గజానికి రూ.12వేలు ఇవ్వాలంటున్నారు.