News January 30, 2025

టీనేజ్ అమ్మాయిలు వీటిని తింటున్నారా?

image

టీనేజ్‌లో అమ్మాయిల శరీరాల్లో మార్పులు వస్తాయి కాబట్టి వారు పోషకాహారం తీసుకోవాలి. కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. వారు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకోవాలి. మటన్, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, వెన్న తినాలి. అలాగే ఓక్రా, బ్రొకోలి, క్యాబేజీ, పాలకూర వంటివి రొటీన్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

Similar News

News November 21, 2025

PHOTO: ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా భారత మహిళా క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెట్‌లో ఫిట్‌నెస్ అనగానే మేల్ క్రికెటర్స్ గురించే మాట్లాడతారు. వాళ్లు జిమ్ చేసే ఫొటోలు, వీడియోలు వైరలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో చూశాక చాలామంది అభిప్రాయం మారినట్లు కనిపిస్తోంది. ఆమె మరెవరో కాదు U-19 T20 వరల్డ్ కప్-2025 విన్నింగ్ కెప్టెన్ నికీ ప్రసాద్. ఆమె ఫిట్‌నెస్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

News November 21, 2025

నేషనల్ న్యూస్ రౌండప్

image

* జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
* బిహార్‌లో 27 మంది మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం నితీశ్.. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి హోంశాఖ కేటాయింపు
* శబరిమల గోల్డ్ చోరీ కేసు.. బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్
* డిసెంబర్ 4న సేలంలో నిర్వహించ తలపెట్టిన TVK విజయ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

News November 21, 2025

జాబ్ చేస్తున్నారా..? ఈ షిఫ్టు మహా డేంజర్!

image

ప్రస్తుతం కంపెనీని బట్టి డే, నైట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యంపై షిఫ్ట్ డ్యూటీల ప్రభావాన్ని పరిశీలిస్తే.. డే షిఫ్టులు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. అదే రొటేషనల్ షిఫ్టులు ప్రమాదకరమని, షెడ్యూల్ తరచూ మారితే శరీరం సర్దుబాటు చేసుకోలేదని హెచ్చరించారు. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.