News January 30, 2025

టీనేజ్ అమ్మాయిలు వీటిని తింటున్నారా?

image

టీనేజ్‌లో అమ్మాయిల శరీరాల్లో మార్పులు వస్తాయి కాబట్టి వారు పోషకాహారం తీసుకోవాలి. కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. వారు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకోవాలి. మటన్, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, వెన్న తినాలి. అలాగే ఓక్రా, బ్రొకోలి, క్యాబేజీ, పాలకూర వంటివి రొటీన్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

Similar News

News February 19, 2025

ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

image

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News February 19, 2025

బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: యోగి

image

UP ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిపారేశారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాగా జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరావని NGTకి నివేదిక ఇచ్చింది.

News February 19, 2025

‘ఐదుగురు స్పిన్నర్లెందుకు?’.. రోహిత్ స్ట్రాంగ్ రిప్లై

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ జవాబిచ్చారు. ‘మీకు ఐదుగురు స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కానీ నాకు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు కనిపిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వల్ల బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది’ అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ తమకెంతో ముఖ్యమని తెలిపారు.

error: Content is protected !!