News February 7, 2025

ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

image

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Similar News

News April 13, 2026

ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

image

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.

News April 13, 2026

ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

image

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్‌(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.

News April 13, 2026

కుప్పకూలిన మార్కెట్లు.. నిమిషాల్లో రూ.8లక్షల కోట్లు హాంఫట్

image

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,624 పాయింట్లు, నిఫ్టీ 476 పాయింట్లు కోల్పోయాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. యుద్ధంపై పీస్ టాక్స్, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో గతవారం మార్కెట్లు 6% వృద్ధి సాధించాయి. కానీ చర్చలు విఫలమవడం, క్రూడాయిల్ ధర పెరగడంతో మళ్లీ నష్టాల బాట పట్టాయి.