News February 19, 2025
ఇన్ని రూ.వేల కోట్లు ఉండిపోయాయా?

చాలా మంది డబ్బులను సేవ్ చేసి మర్చిపోవడంతో అవి ఇన్‌యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. అలా క్లెయిమ్ చేయని డబ్బు కొన్ని రూ.వేల కోట్లలో ఉందనే విషయం మీకు తెలుసా? ఇదంతా సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, టర్మ్ డిపాజిట్లు, జీవిత బీమా వంటి పాలసీల్లో ఉంది. బ్యాంక్ డిపాజిట్లలో రూ.62K కోట్లు, స్టాక్స్‌లో రూ.25K కోట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.35K కోట్లు, EPFలో రూ.48K కోట్లు, ఇన్సూరెన్స్‌లో రూ.21,500 కోట్లు ఉన్నాయి.
Similar News
News March 20, 2025
భారీ ఎన్కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News March 20, 2025
మాలా ఉద్యోగాలిచ్చిన రాష్ట్రమేదైనా ఉందా?: సీఎం రేవంత్

TG: తమ ప్రజాపాలనలో 10 నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ‘నేను సవాల్ చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ప్రధాని మోదీ సీఎంగా పనిచేసిన గుజరాత్లో కానీ, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కానీ మేం ఇచ్చినట్లుగా 10నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చినట్లు రికార్డ్ ఉందా? నేను చర్చకు సిద్ధం. విజ్ఞతతో ఉద్యోగాలిచ్చాం. ప్రజాపాలనతో దేశానికే తెలంగాణ ఓ మోడల్‌గా నిలబడింది’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా: కేటీఆర్

TG: బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ‘యాత్ర గురించి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించాను. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటాను. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభిస్తాను’ అని వెల్లడించారు.