News March 9, 2025
కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీరేనా?

TG: MLA కోటా MLC అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. 4 స్థానాల్లో కాంగ్రెస్‌కు 3, CPIకి 1 దక్కనుంది. INC నుంచి నల్గొండ DCC అధ్యక్షుడు శంకర్ నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. OC లేదా BC కోటాలో జెట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, SC కోటాలో అద్దంకి దయాకర్, రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర నేతలు కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు.
Similar News
News March 10, 2025
ఖమ్మం ప్రయోజనాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీ

ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆదివారం HYDలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖమ్మం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారని సమాచారం. ఎమ్మెల్యేలు కనకయ్య, రాగమయి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఆదినారాయణ, రాందాస్ నాయక్, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.
News March 10, 2025
TODAY HEADLINES

☛ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
☛ TG: చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
☛ పద్మశాలీల రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్
☛ SLBC టన్నెల్ నుంచి మృతదేహం వెలికితీత
☛ APలో టీడీపీ, TGలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
☛ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
☛ ఆసుపత్రిలో చేరిన ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్
News March 10, 2025
మాంసాహారం తింటున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త!

పెరుగుతో గుడ్డు, మాంసాహారం కలిపి తినడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమేనంటున్నారు పోషకాహార నిపుణులు. మాంసాహారం, పాల పదార్థాలను వెనువెంటనే తినకూడదని, తింటే జీర్ణ, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక నాన్ వెజ్ తిన్న తర్వాత టీ తాగితే గుండెల్లో మంట రావొచ్చంటున్నారు. అలాగే మటన్ తర్వాత తేనె తీసుకుంటే ఒంట్లో ఉష్ణం పెరిగిపోతుందని, అది కూడా నివారించాలని సూచిస్తున్నారు.