News December 26, 2024
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే హీరోలు వీళ్లే?
తెలంగాణ CM రేవంత్‌తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది. నిర్మాతల్లో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలుస్తారని సమాచారం.
Similar News
News January 26, 2025
మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్: రష్మిక
తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు. కాగా రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.
News January 26, 2025
అక్కడ ఈ తరంలో తొలిసారి జెండా ఎగురుతోంది
ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో రెండు దశాబ్దాలుగా జాతీయ జెండా ఎగరలేదు. ఆ ప్రాంతం మావోల కీలక నేత హిడ్మా నేతృత్వంలోని PLGA బెటాలియన్ 1 పరిధిలోనిది. ఇరవై ఏళ్లుగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వ పాలన లేని అక్కడ భద్రతా బలగాలు ఇటీవల పట్టు సాధించాయి. ఫోర్సెస్ 14 క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో 14 గ్రామాల్లో ఇవాళ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బస్తర్ యువతరం తొలిసారి జెండావందనం చూడబోతుందని IG సుందర్ రాజ్ తెలిపారు.
News January 26, 2025
వీర జవాన్లకు సీఎం రేవంత్ నివాళి
TG: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం అక్కడే జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.