News March 7, 2025
ఎమ్మెల్యే కోటా MLC అశావహులు వీరేనా?

TG: MLA కోటా MLC సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో పలువురు ఆశావహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. సంపత్ కుమార్ (SC), కుసుమ కుమార్ (కమ్మ), VH, కొనగాల మహేశ్ (మున్నూరు కాపు), చరణ్ కౌశిక్ (యాదవ), శంకర్ నాయక్, విజయభాయి (ST), అద్దంకి దయాకర్ (మాల), ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్ (మైనార్టీ), సామ రామ్మోహన్ (రెడ్డి), విజయశాంతి తదితరులు సీటు ఆశిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 18, 2025
ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్‌లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.
News March 18, 2025
ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.
News March 18, 2025
భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.