News December 19, 2024

ఎన్టీఆర్‌పైనా మీ పిల్లికూతలు?: KTR

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు? పేదల ఇళ్లు కూల్చినా మీ ఆకలి తీరలేదా? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ఈ ప్రభుత్వం ప్రతిరూపం’ అని ట్వీట్ చేశారు. NTR ఘాట్ తొలగించాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News January 22, 2025

9 ఏళ్లకే పెళ్లిని అనుమతించేలా చట్టం తెచ్చారు

image

ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలవుతున్న ఇరాక్ పాలకులు మరో వివాదాస్పద బిల్ పాస్ చేశారు. దీంతో గతంలో 18సం.గా ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సు నిబంధన మారనుంది. మతంలోని ఒక తెగ/వర్గం నిబంధనల ప్రకారం పెళ్లి చేయొచ్చు. అక్కడ షియత్‌లు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ల బాలికకూ పెళ్లి చేయొచ్చు. దీంతో మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

News January 22, 2025

Stock Markets: రిలీఫ్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఖుష్..

image

స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,155 (+130), సెన్సెక్స్ 76,404 (+566) వద్ద క్లోజయ్యాయి. IT, ఫార్మా, హెల్త్‌కేర్, ఫైనాన్స్ షేర్లు పుంజుకున్నాయి. రియాల్టి షేర్లు రక్తమోడాయి. విప్రో, ఇన్ఫీ, టీసీఎస్, టెక్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు టాప్ గెయినర్స్.

News January 22, 2025

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం?

image

AP: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువ, బుక్ వాల్యూ మధ్య తేడాలున్నాయని, వీటిని సరిచేసి రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారని సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు త్వరలోనే స్పష్టత ఇస్తారని వార్తలు వస్తున్నాయి.