News September 9, 2024
గుడ్డులో పసుపు సొనను అవాయిడ్ చేస్తున్నారా..?
గుడ్డుతో శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ చాలామంది పసుపు సొనను తినరు. రుచించకో లేక కొవ్వు పెరుగుతుందన్న భయంతోనో ఎగ్ వైట్స్ మాత్రమే తింటుంటారు. అది సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. పచ్చసొనలో విటమిన్ డీ, ఈ, బీ12, కే, బీ2, బీ9 ఉంటాయి. ఎముకల బలోపేతానికి, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, నరాల పనితీరు మెరుగుపడేందుకు, చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరకమని వారు వివరిస్తున్నారు.
Similar News
News October 9, 2024
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు
AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News October 9, 2024
ఉమెన్స్ WC: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: షఫాలీ, మంధాన, జెమిమా, హర్మన్(C), రిచా, దీప్తి, సాజన, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.
SL: విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, కాంచన, సుగంధిక, ఇనోషి, ఉదేషికా, ఇనోక.
News October 9, 2024
రతన్ టాటా ఆరోగ్యం విషమం?
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. తన ఆరోగ్యం బాగుందంటూ టాటా 2 రోజుల క్రితమే స్పష్టతనిచ్చారు. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నానని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అవే వార్తలు రావడం గమనార్హం.