News January 6, 2025
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ‘ఊరెళ్లేటప్పుడు పక్కింటివారికి మీ ఇంటిని గమనించాలని చెప్పండి. వాహనాలను ఇంటి ఆవరణలో పార్క్ చేయండి. బీరువా, లాకర్ తాళాలు మీతోపాటే తీసుకెళ్లండి. ఇంటి తాళం కనిపించకుండా కర్టెన్ వేయండి. ఏదో ఒక గదిలో లైట్ వేయండి. పేపర్, పాల ప్యాకెట్స్ వద్దని చెప్పండి. ఇంట్లో బంగారం, డబ్బు ఉంటే బ్యాంకులో భద్రపరుచుకోండి’ అని సూచించారు.
Similar News
News October 26, 2025
అలీబాబా దొంగల ముఠాలా రేవంత్ పాలన తయారైంది: KTR

TG: రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయ్యిందని మాజీమంత్రి KTR విమర్శించారు. తెలంగాణ భవన్లో హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘మంత్రి OSD తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకొచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అన్నారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైంది’ అని ఎద్దేవా చేశారు.
News October 26, 2025
శ్రీరామ నామ జప ఫలితాలు

నిరంతరం శ్రీరామ నామ జపం చేయడం వలన మనస్సుకు శాంతి లభిస్తుంది. పాపాలు, దోషాలు నశించి, చిత్తశుద్ధి కలుగుతుంది. దీని ద్వారా హృదయంలో భగవంతుని పట్ల భక్తి పెంపొందుతుంది. నామ సంకీర్తన వలన దుఃఖాలు తొలగి, జీవితంలో ఆనందం నిండుతుంది. అష్టైశ్వర్యాలు, మోక్షం వంటి ఫలాలను కూడా ఈ నామ జపం ప్రసాదిస్తుంది. సర్వవిధాల శ్రేయస్సును, అంతిమంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి నామ జపం ఉత్తమమైన మార్గం. <<-se>>#Bakthi<<>>
News October 26, 2025
భారీ వర్ష సూచన.. మరికొన్ని జిల్లాల్లో సెలవులు

AP: రేపట్నుంచి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రకాశం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 27, 28, 29 తేదీల్లో హాలిడేస్ ఇచ్చారు. విశాఖ, ఏలూరు జిల్లాలో 27, 28 తేదీల్లో.. చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో 27న సెలవులిస్తూ డీఈవోలు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు <<18106376>>హాలిడేస్ ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.


