News January 6, 2025
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ‘ఊరెళ్లేటప్పుడు పక్కింటివారికి మీ ఇంటిని గమనించాలని చెప్పండి. వాహనాలను ఇంటి ఆవరణలో పార్క్ చేయండి. బీరువా, లాకర్ తాళాలు మీతోపాటే తీసుకెళ్లండి. ఇంటి తాళం కనిపించకుండా కర్టెన్ వేయండి. ఏదో ఒక గదిలో లైట్ వేయండి. పేపర్, పాల ప్యాకెట్స్ వద్దని చెప్పండి. ఇంట్లో బంగారం, డబ్బు ఉంటే బ్యాంకులో భద్రపరుచుకోండి’ అని సూచించారు.
Similar News
News January 26, 2025
ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటా: బాలకృష్ణ
తనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ‘శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు. NTR వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను. నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News January 26, 2025
అజిత్‌కు ‘పద్మ భూషణ్’; కరెక్టా? కౌంటరా?
కోలీవుడ్ హీరో అజిత్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటనపై తమిళనాట డివైడ్ డిస్కషన్ అవుతోంది. ఇది తగిన గౌరవమని తల ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఇందులో BJP రాజకీయం ఉందని విజయ్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో MGR, కమల్ పార్టీలు పెట్టినప్పుడు శివాజీ గణేషన్, రజినీకాంత్‌లకు ఇలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చిందని, ఇప్పుడు తమ హీరో పార్టీ ప్రకటించాక అజిత్‌కు అవార్డుతో కౌంటర్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు.
News January 26, 2025
మువ్వన్నెల వెలుగుల్లో సెక్రటేరియట్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ భవనం మువ్వన్నెల విద్యుద్దీపాలతో కాంతులీనింది. నిన్న రాత్రి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.