News October 25, 2024
పిల్లలతో ఇలాంటి నీరు తాగిస్తున్నారా.. BE CAREFUL
ఫ్లోరైడ్ నీటితో కాళ్లు, చేతులు వంకర్లు పోవడం, వికలాంగులు అవ్వడం తెలిసిందే. పిల్లల్లో తక్కువ IQ లెవల్స్‌కు దీనికీ సంబంధముందని HHS NTP రిపోర్టు తాజాగా పేర్కొంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో బ్రెయిన్ బ్లడ్ బారియర్ సామర్థ్యం తక్కువ. ఫ్లోరైడ్ దీనిని దాటేసి మెదడులో మెమరీ, లెర్నింగ్‌కు సంబంధించిన ప్రాంతంలో పేరుకుపోతుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు దారితీసి బ్రెయిన్ సెల్స్‌ను చంపుతుందని తెలిపింది.
Similar News
News November 11, 2024
GET READY: 4.05కు ‘పుష్ప-2’ నుంచి బిగ్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. రిలీజ్ లోపు రెండు ట్రైలర్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 5న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది.
News November 11, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్టు గుర్తించారు.
News November 11, 2024
15న ఓటీటీలోకి కొత్త చిత్రం
సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో సాయిచంద్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 11న <<14329220>>విడుదలైన<<>> ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.