News August 6, 2024

విద్యుత్ వాహనంలో వెళ్తున్నారా.. బీ కేర్‌ఫుల్!

image

విద్యుత్ వాహనాల్లో ప్రయాణించేవారికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్డుపై నీరు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దారిలో వెళ్లకపోవడమే మంచిదని తెలిపారు. ‘రెండడుగుల లోతు ఉన్న నీటిలో వెళ్లిన ఓ విద్యుత్ బస్సు బ్యాటరీలోకి నీరు వెళ్లిపోయి షార్ట్ సర్క్యూట్ అయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఈవీలు నడిపేవారు నీరు నిల్వ ఉన్న రోడ్లపై వెళ్లకండి’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 14, 2026

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

image

AP: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.

News January 14, 2026

పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

image

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్‌ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.

News January 14, 2026

సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?

image

సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ, ఆరోగ్య, చారిత్రక కారణాలున్నాయి. రామాయణం ప్రకారం రాముడు తొలిసారిగా ఈ రోజునే గాలిపటం ఎగురవేశారని నమ్మకం. చలికాలంలో ఎండలో గాలిపటాలు ఎగురవేస్తే శరీరానికి కావాల్సిన విటమిన్-డి అందుతుంది. ఇదొక శారీరక వ్యాయామంగానూ ఉపయోగపడుతుంది. చైనాలో పుట్టిన ఈ గాలిపటాల సంప్రదాయం, కాలక్రమేణా సందేశాల రవాణా నుంచి ఉత్సాహభరితమైన వేడుకగా రూపాంతరం చెంది అందరినీ అలరిస్తోంది.