News April 15, 2025
యూరిన్ ఆపుకుంటున్నారా?

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News April 16, 2025
ద్వేషమేమీ లేదు అభిజిత్‌కు కేక్స్ పంపుతా : రెహమాన్

సంగీత కార్యక్రమాల్లో తాను టెక్నాలజీ అధికంగా వాడుతాను అనేది సింగర్ అభిజిత్ అభిప్రాయమని దాన్ని గౌరవిస్తానని మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ అన్నారు. అలా అన్నందుకు అతనిపై ద్వేషం లేదని, ఆయనకు కేక్స్ పంపిస్తానని తెలిపారు. ఛావా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలకు వందల మంది టెక్నీషియన్లతో కార్యక్రమాలు నిర్వహించానన్నారు. కాగా రెహమాన్ టెక్నాలజీ వాడడంతో కళాకారులకు ఉపాధి లేకుండా పోతుందని అభిజిత్ ఆరోపించారు.
News April 16, 2025
IPL: ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ 20 ఓవర్లలో 188/5 రన్స్ చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 49 రన్స్ చేసి ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యారు. గత మ్యాచులో అదరగొట్టిన కరుణ్ నాయర్‌ను ఈసారి దురదృష్టం వెంటాడింది. ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యారు. అక్షర్ కెప్టెన్ ఇన్నింగ్స్(34) ఆడగా, రాహుల్ 38, స్టబ్స్ 34* రన్స్‌తో రాణించారు. RR బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగా తలో వికెట్ తీశారు.
News April 16, 2025
ఈ నెల 20న BJP జాతీయ అధ్యక్షుడి ప్రకటన?

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెల 20న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి రేసులో మోహన్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నట్లు సమాచారం.