News November 23, 2024
జగన్ వద్ద మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని
AP: వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తాను సంతకం చేయలేదని తెలిపారు. క్యాబినెట్లో చర్చించకుండానే యూనిట్ రూ.2.49తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని చెప్పారు.
Similar News
News November 23, 2024
OFFICIAL: ఝార్ఖండ్ ఫైనల్ రిజల్ట్
ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. JMM ఆధ్వర్యంలోని కూటమి మ్యాజిక్ ఫిగర్ 41 అధిగమించి 56 స్థానాల్లో గెలుపొందింది. జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI ML(L) 2 స్థానాల్లో గెలుపొందాయి. బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ 39,791 ఓట్లతో, గాందే నుంచి కల్పన సోరెన్ 17,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. BJP 20 స్థానాల్లో గెలిచి ఒక చోట లీడ్‌లో ఉంది.
News November 23, 2024
పంజాబ్‌లో ఆప్ జోరు.. నాలుగులో 3 గెలుపు
పంజాబ్‌లో ఉపఎన్నికలు జరిగిన 4 అసెంబ్లీ సీట్లలో ఆప్ 3 చోట్ల విజయం సాధించి రాష్ట్రంలో పట్టునిలుపుకుంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా నలుగురు రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. డేరా బాబా నానక్, చబ్బేవాల్, గిద్దర్‌బాహా స్థానాల్లో ఆప్, బర్నాలాలో కాంగ్రెస్ గెలిచాయి. దీంతో ఆప్ బలం అసెంబ్లీలో 94కు చేరగా, కాంగ్రెస్ బలం 18 నుంచి 16కి తగ్గింది. ప్రజలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.
News November 23, 2024
దేశాధ్యక్షుడిని హత్య చేయిస్తాను: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు
తానే చనిపోయే పరిస్థితి వస్తే.. దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ దంపతులను, ప్రతినిధుల సభ స్పీకర్‌ను హత్య చేయించనున్నట్లు ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డుటెర్టే సంచలన ప్రకటన చేశారు. అందుకోసం ఓ కిల్లర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నట్లు తెలిపారు. 2022లో ఎన్నికలు గెలిచిన సారా, ఫెర్డినాండ్, ఆ తర్వాత బద్ధశత్రువులుగా మారారు. అధ్యక్షుడు తనను చంపించేందుకు చూస్తున్నారనేది సారా ఆరోపణ.