News November 23, 2024
జగన్ వద్ద మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని
AP: వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తాను సంతకం చేయలేదని తెలిపారు. క్యాబినెట్లో చర్చించకుండానే యూనిట్ రూ.2.49తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని చెప్పారు.
Similar News
News December 9, 2024
ప్రభాస్ కోసం కథ రాసిన హీరో రిషబ్ శెట్టి?
‘కాంతార’ సినిమాతో సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథను రాసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న చిత్రాల్లో ఒక దానికి కథను అందించారని, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపాయి. కాగా, సదరు నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రభాస్‌తో మొత్తం మూడు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
News December 9, 2024
సిరియాపై భారత ప్రభుత్వ కీలక ప్రకటన
సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
News December 9, 2024
బీజేపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య
మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.