News June 28, 2024
ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..: రోహిత్ శర్మ

మెగా టోర్నీలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మద్దతు తెలిపారు. ‘విరాట్ క్వాలిటీ ప్లేయర్. 15 ఏళ్లుగా భారత్ తరఫున ఆడుతున్నారు. ఫామ్ అనేది అతడికి సమస్యే కాదు. పెద్ద మ్యాచుల్లో కోహ్లీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అతడి ఇంటెంట్ బాగుంది. ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..’ అని నవ్వుతూ చెప్పారు.
Similar News
News October 20, 2025
డబ్బుల్లేక భోజనం చేసేందుకు ఇబ్బందిపడ్డాం: సమంత

తాను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కుటుంబం పడ్డ బాధలను ఎప్పుడూ మరిచిపోలేదని తెలిపారు. ఆ సమయంలో డబ్బులు సరిగ్గా లేకపోవడంతో భోజనం చేయడానికి ఇబ్బంది పడినట్లు గుర్తు చేశారు. మొదటి సినిమాతోనే పేరు, ప్రశంసలు వచ్చాయని, వాటిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదన్నారు. కష్టపడితేనే జీవితం ఉంటుందని తనను తాను మార్చుకొని ముందుకు వెళ్లానని వెల్లడించారు.
News October 20, 2025
దీపావళి వెనుక పురాణగాథలు తెలుసా?

నరకాసురుడిని శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ వధించిన మరుసటి రోజే దీపావళి జరుపుకుంటారని ప్రసిద్ధి. లంకాధిపతి రావణుడిని వధించిన శ్రీరాముడు ఇదే రోజున సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్నారని, వారికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలా నిర్వహించారని రామాయణ గాథ చెబుతోంది. ఈ వెలుగుల పండుగ దీపావళి మీ జీవితంలోని చీకట్లను తొలగించి సరికొత్త కాంతులను నింపాలని ఆకాంక్షిస్తున్నాం.
HAPPY DIWALI
News October 20, 2025
దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్‌పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్‌తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.