News June 28, 2024
ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..: రోహిత్ శర్మ
మెగా టోర్నీలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మద్దతు తెలిపారు. ‘విరాట్ క్వాలిటీ ప్లేయర్. 15 ఏళ్లుగా భారత్ తరఫున ఆడుతున్నారు. ఫామ్ అనేది అతడికి సమస్యే కాదు. పెద్ద మ్యాచుల్లో కోహ్లీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అతడి ఇంటెంట్ బాగుంది. ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..’ అని నవ్వుతూ చెప్పారు.
Similar News
News October 12, 2024
తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల
TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.
News October 12, 2024
ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర
AP: ధరల విషయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
News October 12, 2024
కాళీ దేవి కిరీటం చోరీని ఖండించిన భారత్
బంగ్లాదేశ్‌లోని ఓ ఆలయంలో PM మోదీ సమర్పించిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైన ఘటనను భారత్ ఖండించింది. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన అపవిత్ర చర్యగా పేర్కొంది. తాంతిబజార్‌లోని పూజా మండపంపై దాడి, సత్ఖిరాలోని జేషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీ ఘటనలను ఆందోళనకర చర్యలుగా గుర్తించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఘటనలు శోచనీయమని పేర్కొంది.