News February 8, 2025
ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2026
హగ్ డే స్పెషల్.. CSK నుంచి స్పెషల్ పోస్ట్

నేడు ‘హగ్ డే’ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మైదానంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, స్మృతి- హర్మన్, ధోనీ- జడేజా, టెండూల్కర్-ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లు కౌగిలించుకున్న అరుదైన చిత్రాలను CSK తన X ఖాతాలో పంచుకుంది. గెలుపు సమయంలో పొంగివచ్చే సంతోషాన్ని ఈ ఫొటోలు ప్రతిబింబిస్తున్నాయి.
News February 12, 2026
సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.
News February 12, 2026
ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు!

TG: మున్సిపల్ ఫలితాలు వెల్లడికాక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. తమకు మెజార్టీ వచ్చే స్థానాల్లోని అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. BRS MLA జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి అభ్యర్థులను HYD శివార్లలోని రహస్య ప్రాంతానికి తరలించారు. మంచిర్యాల నుంచి తడోబాకు, ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బీజేపీ అభ్యర్థులను తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.


