News August 27, 2024
తరచూ పారాసెటమాల్ వేసుకుంటున్నారా?
కాస్త అలసటగా అనిపించినా జ్వరం, జలుబు, తలనొప్పి వచ్చినా చాలామంది వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే అతిగా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కాలేయంపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్దలు రోజుకు గరిష్ఠంగా 4గ్రాములకు మించి ఈ ట్యాబ్లెట్ తీసుకోవద్దని చెబుతున్నారు. అంటే రోజుకు 2 కంటే ఎక్కువ తీసుకోవద్దు. అది కూడా వైద్యుల సలహాతోనే తీసుకోవాలంటున్నారు.
Similar News
News September 12, 2024
మెటా ఏఐకి పబ్లిక్ ఫిగర్ల వాయిస్!
వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.
News September 12, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
News September 12, 2024
వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు: గంటా శ్రీనివాస్
AP: వరద బాధితుల్ని ఆదుకోకుండా జైలులో ఉన్న పార్టీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారని MLA గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘బాధితులకు GOVT అందిస్తున్న సాయంపై ఆరోపణలు చేస్తే చరిత్రహీనులుగా మారుతారు. ఎన్నికల్లో YCPని ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌లో మార్పు రాలేదు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారు. కూటమి సర్కార్ గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారు’ అని అన్నారు.