News April 1, 2024
దాహంతో అల్లాడాల్సిందేనా?

బెంగళూరు నీటి కష్టాలు దేశంలోని ఇతర నగరాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. దేశంలో 2030నాటికి 40% ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతి ఆయోగ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2050కల్లా ఢిల్లీ, ముంబై, లక్నో, HYD, విశాఖపట్నంతో సహా డజనుకుపైగా నగరాల్లోని ప్రజలు దాహంతో అల్లాడక తప్పదని వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక హెచ్చరిస్తోంది. ఇండో-గంగా బేసిన్‌లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయని UN సైతం పేర్కొంది.
Similar News
News February 3, 2026
మామోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలంటే..

మామోగ్రఫీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించే పరీక్ష. ఛాతీలో ఏమైనా మార్పులు, చనుమోనల తీరు మారినా, రొమ్ములో వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మామోగ్రఫీ చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ రెండేళ్లకు ఒకసారి మామోగ్రామ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. సకాలంలో గుర్తించగలిగితే ప్రాణనష్టాన్ని నివారించే అవకాశాలు పెరుగుతాయి.
News February 3, 2026
నీలమణి రత్నం ధరిస్తున్నారా?

నవరత్నాలలో శక్తివంతమైనది నీలమణి. ఇది శనిదేవునికి సంకేతం. దీన్ని ధరిస్తే ఐశ్వర్యం, ఆనందం సిద్ధిస్తాయి. అయితే ఈ రత్నపు ఉంగరం ధరించిన వారు మద్యం తీసుకోరాదు. దీన్ని పదేపదే తీయరాదు. అలా చేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఒకరు పూజించి ధరించిన నీలమణిని మరొకరు ధరించకూడదు. అలాగే ఈ రత్నం ధరిస్తే సోమరితనం వీడాలి. ఇతరులకు హాని చేయకూడదు. దయతో ప్రవర్తించాలి. లేనిపక్షంలో శనిదేవుడు ఆగ్రహానికి గురవుతాడని నమ్మకం.
News February 3, 2026
అమరావతికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలి: SA రిపోర్టు

AP: అమరావతి రాజధానికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలని తాజాగా విడుదలైన సోషల్ ఆడిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద స్కేల్ ప్రాజెక్టుపై రాజకీయాలు లేదా ఇతర ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది స్థానికుల జీవనోపాధిపై దుష్ప్రభావం చూపుతుంది. వారి జీవితాలను దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలంది. రోజువారీ కూలీపై ఆధారపడి ఉన్న భూమిలేని వారిని ఆదుకోవాలని సూచించింది.


