News February 24, 2025
AC వాడుతున్నారా? పవర్ బిల్ ఇలా తగ్గించండి

– రిమోట్‌తోనే AC ఆఫ్ చేస్తే కంప్రెసర్ ఐడిల్ లోడ్‌లో ఉంటుంది. ఇలా కాకుండా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి.
– కిటికీలు, తలుపులు తరుచూ తెరిచినా బయటి వేడి లోపలికి వచ్చి రూమ్ చల్లబడేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది
– షెడ్యూల్ టైమర్/టైమర్‌ను సెట్ చేస్తే రాత్రి పడుకున్నాక ఆఫ్ చేయడం మర్చిపోయినా ఇబ్బంది ఉండదు
– చాలాకాలం తర్వాత ఏసీ వాడితే గ్యాస్, డస్ట్ తదితరాలు చెక్ చేసే సర్వీస్ చేయిస్తే కండిషన్‌లో ఉంటుంది
Similar News
News March 16, 2025
CM రేవంత్ దీనికి సమాధానం చెప్పాలి: KTR

TG: OUలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని KTR అన్నారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో CM సమాధానం చెప్పాలన్నారు. ‘ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న CM, 6 గ్యారంటీలతో పాటు దీనిని అటకెక్కించారు’ అని ట్వీట్ చేశారు.
News March 16, 2025
టీమ్‌ను మార్చినా ఓటమి తప్పలేదు

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. NZ గడ్డపై పాక్‌కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.
News March 16, 2025
ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతి నొప్పి, ఆస్పత్రిలో చేరిక

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.