News September 5, 2024

బెయిల్‌పై వాదనలు: కేజ్రీవాల్ పారిపోతాడన్న భయం లేదు

image

మద్యం స్కామ్‌ కేసులో CBI తనను రెండేళ్ల పాటు అరెస్టు చేయలేదని ఢిల్లీ CM కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ED పెట్టిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 26న బెయిల్ రాగానే ముందస్తుగా అరెస్టు చేసిందని పేర్కొన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. CBI FIRలో కేజ్రీ పేరులేదని, రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన విదేశాలకు పారిపోతాడన్న భయం లేదన్నారు. ఆయనతో సమాజానికి ముప్పు ఉండదన్నారు.

Similar News

News September 13, 2024

అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?

image

AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

News September 13, 2024

ALERT.. మళ్లీ వర్షాలు

image

AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

News September 13, 2024

ఈ నెల 21న మోదీ-బైడెన్ భేటీ

image

ఈ నెల 21న క్వాడ్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో కూడా పాల్గొంటారని పేర్కొంది. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్‌లో జరిగే ఈ సదస్సులో క్వాడ్ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రకృతి వైపరీత్యాలపై స్పందన, సముద్ర భద్రత వంటి విషయాలపై చర్చించనున్నారు.