News May 14, 2024

కేంద్రంలో దొరల పాలన నడుస్తోంది: జైరామ్

image

మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. వారు నడిపించేది లోక్‌తంత్ర కాదని, ధనతంత్ర(దొరల పాలన) అని ఆరోపించారు. ప్రస్తుతం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయన్నారు. వాటిని కాపాడేందుకే తాము ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామని పేర్కొన్నారు. మోదీ అయోమయంలో ఉన్నారని, అందుకే హిందూ-ముస్లిం, మంగళసూత్రం, అంబానీ-అదానీ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Similar News

News April 3, 2026

శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో…?

image

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీల పాలకవర్గాలు పదవీకాలం గురువారంతో ముగిసింది. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మండల స్థాయి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం మేరకు బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనేది గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

News April 3, 2026

మెగా మేనల్లుడి కొత్త సినిమా.. పోస్టర్ అదుర్స్

image

సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘సీక్రెట్స్ ఆఫ్ ది ఏజెస్.. పవర్ బియాండ్ ఇమాజినేషన్’ అంటూ తన 19వ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ డైరెక్టర్లు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

News April 3, 2026

నిహారిక ‘రాకాస’ రివ్యూ&రేటింగ్

image

కోటలోని బ్రహ్మరాక్షసుడి బలికి చిక్కిన హీరో బయటపడటానికి ఏం చేశాడనేదే ‘రాకాస’ స్టోరీ. ఎప్పటిలాగే సంగీత్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఫస్టాఫ్‌ స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. నిహారిక ప్రొడక్షన్ వ్యాల్యూస్, అనుదీప్ దేవ్ BGM ఫర్వాలేదు. లాజిక్‌లు మిస్సవ్వడం, రొటీన్ హారర్ కామెడీ ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ మానస శర్మ తడబడ్డారు.
రేటింగ్: 2.25/5