News December 12, 2024
రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు

ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.
Similar News
News January 8, 2026
నాకు మంచి పేరు వస్తుందనే ఆపేశారు: జగన్

AP: తనకు మంచి పేరు వస్తుందనే రాయలసీమ ఎత్తిపోతలను అర్ధాంతరంగా ఆపేశారని జగన్ విమర్శించారు. ‘శ్రీశైలం నుంచి 800అడుగుల్లోనే AP 3TMCల నీళ్లు తీసుకునేలా ప్రాజెక్ట్ చేపట్టాం. రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పనులు స్పీడప్ చేశాం. ప్రాజెక్ట్ పూర్తయితే నాకు మంచి పేరు వస్తుందని TGలో TDP కార్యకర్తలతో CBN కేసులు వేయించారు. అయినా పనులు కొనసాగించాం. ప్రభుత్వం మారగానే ఎత్తిపోతలకు చంద్రగ్రహణం పట్టింది’ అని మండిపడ్డారు.
News January 8, 2026
చంద్రబాబు అందుకే నోరు మెదపడం లేదు: జగన్

AP: ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరకడం వల్లే నీళ్ల విషయంలో CBN నోరు మెదపడం లేదని జగన్ ఆరోపించారు. ‘శ్రీశైలంలో 800 అడుగులలోపే 2 TMCల నీళ్లు తీసుకునేందుకు TG పాలమూరు-RR నిర్మిస్తోంది. SLBCతో 45 TMCలు తరలించాలని చూస్తోంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల పవర్ హౌస్‌లు తెలంగాణే ఆపరేట్ చేస్తోంది. ఇష్టారీతిన నీళ్లు తరలిస్తోంది’ అని మండిపడ్డారు. CBN చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
News January 8, 2026
అవకాడో సాగులో ఏ మొక్కలతో ఎక్కువ దిగబడి వస్తుంది?

అవకాడోలను సాధారణంగా విత్తనాల నుంచి ప్రవర్ధనం చేస్తారు. అయితే అధిక దిగుబడినిచ్చే మొక్కల నుంచి అంటుకట్టడం మరియు మొగ్గ తొడగడం అనే రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కల నుంచి అధిక దిగుబడులు వస్తాయి. విత్తనాలను నేరుగా మట్టిలో నాటవచ్చు లేదా రబ్బర్, ప్లాస్టిక్ సంచులలో నర్సరీ మిశ్రమంలో 2 నుంచి 3 గింజలను నాటాలి. తోటలలో నాటడానికి ముందు 2 నుంచి 3 నెలల వరకు గ్రీన్‌హౌస్‌లలో అవకాడో మొక్కలను పెంచడం మంచిది.


