News August 14, 2024
రేపటి నుంచి ఆరోగ్య శ్రీ బంద్: ఆస్పత్రులు
AP: పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు ఇచ్చింది. ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం’ అని ప్రభుత్వానికి లేఖ రాసింది.
Similar News
News September 15, 2024
చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబంలో ఐదుగురిని చంపేశారు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంట పీఎస్ పరిధి ఇట్కల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
News September 15, 2024
కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుంది: రేవంత్
TG: ఎన్నో ఇబ్బందుల మధ్య సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇప్పటి వరకు మహిళలు 85 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. మోదీ, KCR హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగాయని విమర్శించారు.
News September 15, 2024
రిటైర్మెంట్‌పై స్టార్ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు
తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.