News August 2, 2024

ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది.. అవాస్తవాలు నమ్మొద్దు: మంత్రి

image

AP: ఆరోగ్య శ్రీ తొలగిస్తామంటూ YCP అసత్య ప్రచారాలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం కొనసాగుతుందని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఆస్పత్రులకు రూ.2100 కోట్ల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా? కాదా? YCP నేతలు చెప్పాలని నిలదీశారు. కేంద్రం 17 వైద్యకళాశాలలను 2020లో ప్రకటిస్తే వాటిని పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు.

Similar News

News November 28, 2025

HYD: విశిష్ట రంగస్థల పురస్కారం గ్రహీత.. ప్రొఫైల్ ఇదే!

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావుకు 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం వరించింది. 2001లో K2 నాటికకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, 2020లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, తెలుగులో ‘ప్రతాప రుద్రమ’ నాటకానికి దర్శకత్వం వహించిన తొలి తెలుగువాడిగా ఘనత సాధించారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి సందర్శించారు.

News November 28, 2025

ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

image

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.

News November 28, 2025

ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

image

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iimv.ac.in