News August 2, 2024
ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది.. అవాస్తవాలు నమ్మొద్దు: మంత్రి

AP: ఆరోగ్య శ్రీ తొలగిస్తామంటూ YCP అసత్య ప్రచారాలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం కొనసాగుతుందని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఆస్పత్రులకు రూ.2100 కోట్ల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా? కాదా? YCP నేతలు చెప్పాలని నిలదీశారు. కేంద్రం 17 వైద్యకళాశాలలను 2020లో ప్రకటిస్తే వాటిని పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు.
Similar News
News December 8, 2025
ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.
News December 8, 2025
ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.
News December 8, 2025
‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.


