News July 18, 2024

యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు!

image

TG: రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డుల తరహాలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది. దీనినే హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు సమాచారం. అందరికీ పథకాన్ని వర్తింపజేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి రూ.1,100 కోట్లు ఖర్చవుతుండగా అదనంగా రూ.400 కోట్లు పెరగొచ్చని అంచనా.

Similar News

News October 8, 2024

జమ్మూ ప్రజలు మాతోనే ఉన్నారు: కిషన్ రెడ్డి

image

జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు తమతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని వివరించారు. కాగా, J&Kలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలవగా, జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటింది.

News October 8, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లా బ్యాటర్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ ఆడబోనని తెలిపారు. వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2007లో అరంగేట్రం చేసిన ఆయన బంగ్లా తరఫున ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 139 టీ20లు ఆడారు. మొత్తం 10,695 రన్స్ చేశారు. టెస్ట్ ఫార్మాట్‌కు 2021లో గుడ్ బై చెప్పారు.

News October 8, 2024

అదృష్టం: 32 ఓట్ల మెజార్టీతో గెలిచాడు!

image

హరియాణాలో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు. ఉచన కలాన్‌లో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ కాంగ్రెస్ క్యాండిడేట్ బ్రిజేంద్ర సింగ్‌పై 32 ఓట్ల తేడాతో గెలిచారు. దేవేందర్‌కు 48,968 ఓట్లు రాగా బ్రిజేంద్రకు 48,936 ఓట్లు పోలయ్యాయి. కాగా సాయంత్రం 5 గంటలకు ఈసీ లెక్కల ప్రకారం హరియాణాలో బీజేపీ 39 సీట్లలో గెలిచి, తొమ్మిదింటిలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 31 సీట్లలో గెలిచి, ఆరింట్లో లీడ్‌లో ఉంది.