News March 24, 2024
కేజ్రీవాల్ అరెస్టును కోరితెచ్చుకున్నారు: అస్సాం సీఎం
సీఎం కేజ్రీవాల్ అరెస్టును తానే కోరితెచ్చుకున్నారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. ‘కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిదిసార్లు నోటీసులు పంపింది. వాటిని అతడు బేఖాతరు చేశారు. తొలి సమన్లకే స్పందించి ఉంటే బహుశా అరెస్ట్ అయ్యేవారు కాదేమో. కొన్ని నెలల క్రితం సమన్లు వచ్చిన వెంటనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు’ అని హిమంత తెలిపారు. సానుభూతి కోసమే కేజ్రీవాల్ ఇలా చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News September 14, 2024
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల
AP: యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ వైసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్‌గా నియమించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ బాధ్యతలూ ఆయనకే అప్పగించారు.
News September 14, 2024
విధ్వంసం.. 45 బంతుల్లో 139 పరుగులు
కేరళ క్రికెట్ లీగ్‌లో త్రిస్సూర్ టైటాన్స్ ఆటగాడు విష్ణు వినోద్ విధ్వంసం సృష్టించారు. అలెప్పీ రిపిల్స్‌తో మ్యాచ్‌లో 45 బంతుల్లోనే 139 పరుగులు చేశారు. ఇందులో 17 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. తొలుత అలెప్పీ 20 ఓవర్లలో 181/6 స్కోర్ చేయగా, వినోద్ వీర విహారంతో త్రిస్సూర్ 12.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. IPLలో అతడిని MI రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. 2021లో ఢిల్లీ, 2022లో SRH టీమ్స్‌లో ఉన్నారు.
News September 14, 2024
UPSC సివిల్ సర్వీసెస్ అడ్మిట్ కార్డులు విడుదల
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <