News November 28, 2024
నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్.. ICCలో అప్పీల్

ఇజ్రాయెల్ PM నెతన్యాహు, డిఫెన్స్ మాజీ మంత్రి యోవ్ గాలెంట్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC) గత వారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని ICCలో అప్పీల్ చేసినట్లు ఇజ్రాయెల్ PMO తెలిపింది. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తే ICC ఇజ్రాయెల్ పట్ల ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తుందో తెలుస్తుందని పేర్కొంది. గాజాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ICC నోటీసులిచ్చింది.
Similar News
News November 27, 2025
VKB: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని వైద్యాధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి పర్యవేక్షక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్తో ఈజీగా..

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It


