News November 28, 2024

నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్‌.. ICCలో అప్పీల్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు, డిఫెన్స్ మాజీ మంత్రి యోవ్ గాలెంట్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC) గత వారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని ICCలో అప్పీల్ చేసినట్లు ఇజ్రాయెల్ PMO తెలిపింది. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తే ICC ఇజ్రాయెల్ పట్ల ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తుందో తెలుస్తుందని పేర్కొంది. గాజాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ICC నోటీసులిచ్చింది.

Similar News

News December 4, 2024

‘సీజ్ ద షిప్’ డ్రామా అట్టర్ ఫ్లాప్: YCP

image

‘సీజ్ ద షిప్’ డ్రామా బెడిసికొట్టిందని YCP ఎద్దేవా చేసింది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్, నాదెండ్ల ద్వయం రాద్ధాంతం చేశారంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకర్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి జరుగుతోందని, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్‌లోకి బియ్యం లోడింగ్ చేశారని తెలిపింది. రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే అని ఆరోపించింది. మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి షిప్ ఎందుకు తనిఖీ చేయలేదు? అని ‘X’లో ప్రశ్నించింది.

News December 4, 2024

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన మెగా హీరో

image

భారీ అంచనాలతో రిలీజవుతున్న ‘పుష్ప-2’ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప-2’ టీమ్‌కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్‌ & టీమ్‌కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.

News December 4, 2024

పుష్ప-2 ఇడ్లీల పేరుతో RGV ట్వీట్

image

సినిమాలు లాభాల కోసమే నిర్మిస్తారని, ప్రజా సేవకు కాదని RGV అన్నారు. సుబ్బారావు అనే వ్యక్తి హోటల్ పెట్టి ఇడ్లీ ప్లేట్ రూ.1000గా నిర్ణయించారని, ధర అందుబాటులో లేదని ఏడిస్తే అది సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనమన్నారు. అలాగే పుష్ప-2ది సెవెన్ స్టార్ క్వాలిటీ అన్నారు. అటు, ఎంటర్టైన్మెంట్ అంత నిత్యావసరమా? రేట్లు తగ్గాక కూడా చూసుకోవచ్చు కదా? అని ‘X’లో పోస్ట్ చేశారు.