News August 13, 2024
అర్షద్ నదీమ్‌కు బహుమతుల వెల్లువ
పాక్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి రూ.41.97 లక్షలు, పాక్ సర్కారు నుంచి సుమారు రూ.4.5 కోట్లు, అక్కడి పంజాబ్ సీఎం నుంచి 100 మిలియన్(PKR), సింధ్ సీఎం నుంచి 50 మిలియన్(PKR), పాక్ సర్కారు నుంచి హిలాల్-ఈ-ఇంతియాజ్ పురస్కారం, బంగారు కిరీటంతో సన్మానం, సుక్కూర్ ప్రాంతంలో ఓ క్రీడా స్టేడియానికి అతడి పేరు, కరాచీలో అతడి పేరిట ఓ స్పోర్ట్స్ అకాడమీ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News September 13, 2024
మూత్రం, మురుగు నీటి నుంచి బీర్ తయారీ!
సింగపూర్‌లో న్యూబ్రూ అనే కంపెనీ బీర్‌ను తయారుచేస్తుంటుంది. ఆ బీర్ రుచి ఇతర కంపెనీల మాదిరిగానే ఉన్నా వాస్తవంగా మూత్రం, మురుగునీటి నుంచి శుద్ధి చేసిన నీటి నుంచి దాన్ని తయారు చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం దేశ డ్రైనేజీల్ని రీసైకిల్ చేసి ‘నెవాటర్’ అనే తాగునీటిని ఉత్పత్తి చేస్తోంది. ఆ నీటినే న్యూబ్రూ వాడుతోంది. తయారీలో అంతర్జాతీయ ప్రమాణాల్ని అనుసరిస్తున్నామని సంస్థ వినియోగదారులకు హామీ ఇస్తోంది.
News September 13, 2024
పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్.. గరిష్ఠంగా రూ.10 వేలే సబ్సిడీ: కేంద్రమంత్రి
విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం PM ఈ-డ్రైవ్ స్కీమ్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించింది. కాగా స్కీమ్ కింద తొలి ఏడాది గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రెండో ఏడాది గరిష్ఠంగా రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఇ-రిక్షాలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.12,500 అందిస్తామన్నారు.
News September 13, 2024
బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్
బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్‌ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్‌లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.