News November 30, 2024
వికెట్లు తీయడంలో బుమ్రాకంటే అర్షదీప్ బెటర్: చోప్రా

టీ20 ఫార్మాట్‌లో వికెట్లు తీయడంలో జస్ప్రీత్ బుమ్రా కంటే అర్షదీప్ మంచి బౌలరని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. ‘నైపుణ్యం పరంగా అర్షదీప్ స్థానం బుమ్రా తర్వాతే. కానీ వికెట్లు తీయడంలో మాత్రం బుమ్రాకంటే మెరుగైన బౌలర్’ అని అన్నారు. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు(95) తీసిన రెండో బౌలర్‌గా అర్షదీప్ ఉన్నారు. మరో వికెట్ తీస్తే.. అత్యధిక వికెట్లు తీసిన చాహల్‌ను(96) సమం చేస్తారు.
Similar News
News January 16, 2026
14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.
News January 16, 2026
242 బెట్టింగ్ సైట్లు బ్లాక్

ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. చట్టవిరుద్ధమైన 242 సైట్ల లింక్‌లను బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 7,800 ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను నిషేధించింది. వీటి వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.
News January 16, 2026
కుజ దోషం తగ్గు మొహం పట్టాలంటే…?

జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే వివాహ ఆలస్యం, రుణబాధలు, సంతాన సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆ గ్రహానికి అధి దేవుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. నిత్యం ‘రుణ విమోచక అంగారక స్తోత్రం’ పఠించడం, మంగళవారం ఎర్రని పుష్పాలతో అంగారకుడిని పూజించడం వల్ల దోషాలు తొలగుతాయి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయిస్తే వివాహ, ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల సంపదలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.


