News April 10, 2024

జనంతో చార్మినార్ మార్కెట్ల కళకళ

image

ఈరోజు చందమామ కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ను జరుపుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని చార్మినార్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గాజులు, అత్తర్లు సహా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేసే పలు రకాలైన అలంకరణ వస్తువులు, దుస్తులు అక్కడ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా అక్కడ జనం షాపింగ్‌ చేస్తుంటారు.

Similar News

News November 15, 2024

అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300కోట్లు?

image

‘పుష్ప-2’ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు అల్లు అర్జున్ రూ.300కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇది షారుఖ్, దళపతి విజయ్, ప్రభాస్ తీసుకుంటున్న దానికంటే ఎక్కువని తెలిపింది. దీంతో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న యాక్టర్‌గా ఐకాన్ స్టార్ నిలిచారని వివరించింది. DEC5న థియేటర్లలోకి రాబోతున్న ‘పుష్ప-2కు’ నార్త్‌లో భారీగా కలెక్షన్స్ వస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News November 15, 2024

ప్రభుత్వ అస్థిరతకు BJP, BRS కుట్ర: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింపతీ కోసమే కేటీఆర్ పదేపదే అరెస్టు అంటున్నారని, ఆయన అరెస్టుకు తాము కుట్ర చేయలేదని తెలిపారు. లగచర్లలో అధికారులపై హత్యాయత్నం జరిగిందని, రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

News November 15, 2024

BGT: INDపై AUS గేమ్‌ప్లాన్

image

ఆసీస్‌లో అడుగుపెట్టిన IND ఒకేసారి 2 గేముల్లో తలపడాల్సి ఉంటుంది. ఒకటి క్రికెట్. రెండోది మైండ్‌గేమ్. కొన్నేళ్లుగా అక్కడిదే ఒరవడి. ముందు అక్కడి మీడియా భారత జట్టులో విభేదాలున్నట్టు నెరేటివ్ సృష్టిస్తుంది. ఆ తర్వాత పాంటింగ్ సహా ఇతర మాజీలు భారత క్రికెటర్ల ఫామ్ బాలేదని, ఓడిపోతారని చెప్పేస్తారు. కోహ్లీతో పెట్టుకోవద్దని అప్పట్లో మానేశారు. IND ఫామ్ లేమి, NZ చేతిలో క్లీన్‌స్వీప్ అవ్వడంతో మళ్లీ మొదలెట్టారు.