News September 6, 2024

ఆర్టికల్-370 ముగిసిన అధ్యాయం: అమిత్ షా

image

ఆర్టికల్-370 అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటనలో స్పష్టం చేశారు. దాన్ని తిరిగి తీసుకురావడం జరగదని తేల్చిచెప్పారు. 370వ అధికరణను తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడంతో షా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా.. జమ్మూకశ్మీర్‌లో 2014 తర్వాత తొలిసారిగా ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 8న ఫలితాలు వెల్లడవుతాయి.

Similar News

News October 6, 2024

జనసంద్రమైన మెరీనా బీచ్(PHOTOS)

image

చెన్నైలో ఎయిర్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో లక్షలాది మంది ఎయిర్‌షోను చూసేందుకు తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ అంతా జనసంద్రమైంది. బీచ్‌కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఈక్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.

News October 6, 2024

పాక్‌పై మరోసారి ఆధిపత్యం చాటిన భారత్

image

భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించింది. ఇరు జట్లు ఇప్పటివరకు మెగా టోర్నీల్లో 8 సార్లు తలపడి భారత్ 6 సార్లు గెలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా దాయాదుల మధ్య 16 టీ20 మ్యాచులు జరగ్గా 13 భారత్, 3 పాక్ గెలిచింది.

News October 6, 2024

చెన్నైలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

image

చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 100 మంది స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.