News March 21, 2024
అరుణాచల్ భారత్‌దే.. అమెరికా స్పష్టీకరణ

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.
Similar News
News April 14, 2025
టాప్ మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు రేపు సన్మానం

AP: ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ, KGBV, APRJC, మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్, ఒకేషనల్ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన ఇంటర్ విద్యార్థులను మంత్రి లోకేశ్ సన్మానించనున్నారు. రేపు మ.2 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో 52 మందికి అవార్డులను అందించనున్నారు. వీరితో పాటు ఆరుగురు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులనూ లోకేశ్ సన్మానించనున్నారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించనున్నారు.
News April 14, 2025
దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ మీకు తెలుసా?

బర్ధమాన్ జిల్లా(WB)లోని ఓగ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు ఇప్పటి వరకూ పేరే లేదు. తొలుత రాయ్‌నగర్ అని ఉండేది. అయితే 2008లో ట్రాక్‌ని కొద్ది మేర పెంచడంతో సమీపంలోని రైనా అనే గ్రామంలో స్టేషన్‌ను పునర్నిర్మించారు. దీంతో రైనా పేరుతో రైల్వేస్టేషన్ ఉండాలని గ్రామస్థులు నిరసన చేశారు. రెండు గ్రామాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రైల్వేశాఖ ఇప్పటివరకూ స్టేషన్‌కు పేరే పెట్టలేదు.
News April 14, 2025
దిగ్గజ బ్రిటిష్ నటి కన్నుమూత

దిగ్గజ బ్రిటిష్ నటి జీన్ మార్ష్(90) కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. బ్రిటిష్ డ్రామా ‘అప్‌స్టెయిర్స్, డౌన్‌స్టెయిర్స్’కి 1975లో ఆమె ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 2012లో జీన్‌కు ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ గౌరవం దక్కింది.