News March 19, 2024
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే!
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోనిదేనని ఇటీవల చైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆ ఈశాన్య రాష్ట్రం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. పదేపదే నిరాధార వాదనలు చేసినంత మాత్రాన అవి నిజమైపోవని పేర్కొంది. దేశం నుంచి ఆ రాష్ట్రాన్ని విడదీయలేమంది. అభివృద్ధి కార్యక్రమాలతో అరుణాచల్ ప్రజలు భవిష్యత్తులోనూ లబ్ధి పొందుతారని తెలిపింది.
Similar News
News September 18, 2024
తిరుమల ప్రసాదం విషయంలో ప్రమాణం చేయడానికి సిద్ధం: వైవీ
AP: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన <<14134836>>వ్యాఖ్యలు <<>>అత్యంత దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్దమా?’ అని సవాల్ విసిరారు.
News September 18, 2024
BRS విజయాలతో కాంగ్రెస్ గొప్పలు: హరీశ్ రావు
TG: బీఆర్ఎస్ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇలా గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ‘BRS హయాంలోనే MSMEల అభివృద్ధి జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇవి మూతపడ్డా, ఇక్కడ మాత్రం సగర్వంగా ఎదిగింది. ఎంఎస్ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
News September 18, 2024
నెల్లూరు, పల్నాడు జిల్లాల వైసీపీ అధ్యక్షుల ఎంపిక
AP: ఉమ్మడి నెల్లూరు(D) YCP అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని, పల్నాడు(D) అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని YCP నియమించింది. నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా అనిల్ కుమార్ యాదవ్‌ను నియమించింది. ఇటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ప.గో(D) పాలకొల్లుకి చెందిన నేత మేకా శేషుబాబుని YCP సస్పెండ్ చేసింది.