News June 2, 2024
అరుణాచల్, సిక్కిం ఫైనల్ ఫలితాలు
అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. NPP 5, NCP 3, PPA 2, INC ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ మోర్చా) దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. 32 స్థానాలకుగాను ఏకంగా 31 చోట్ల విజయదుందుభి మోగించింది. SDF ఒక స్థానంతో సరిపెట్టుకోగా, BJP, INC ఖాతా తెరవలేదు.
Similar News
News September 20, 2024
భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు: పవన్
AP: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టుల్లో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
News September 20, 2024
రోహిత్ వైఫల్యం.. ఇది నాలుగోసారి మాత్రమే!
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో మళ్లీ విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్లకే పేస్‌కు చిక్కారు. కానీ ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో రోహిత్ రెండంకెల స్కోరు దాటకపోవడం ఇది నాలుగోసారి మాత్రమే. ఇంతకు ముందు 2015లో శ్రీలంక, 2015, 2023లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో శర్మ సింగిల్ డిజిట్లకే పెవిలియన్ చేరారు. వచ్చే టెస్టులో అయినా ఆయన పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News September 20, 2024
ప్చ్.. భారతీయ ఉద్యోగి! టూ మచ్ వర్కింగ్ అవర్స్..
ఉద్యోగులు కుటుంబ జీవితానికి ఎంత దూరమవుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. సగటు భారతీయుడు వారానికి 46.7Hrs పనిచేస్తున్నాడని ILO డేటా ద్వారా తెలిసింది. దీంతో సుదీర్ఘ సమయం పనిచేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని వర్క్‌ఫోర్స్‌లో 51% మంది వారానికి 49Hrs మించి పనిచేస్తుండటం గమనార్హం. 61 శాతంతో భూటాన్ No.1 ప్లేస్‌లో ఉంది. UAE 50.9, లెసొతో 50.4, బంగ్లా 47, పాక్ 40 టాప్10లో ఉన్నాయి.